ప్రేమ రాశిఫలాలు 2025
ఈ ఆస్ట్రోసేజ్ ఆర్టికల్ లో మీము మీకు 2025 సంవస్త్రంలో అన్ని రాశుల వారు ప్రేమ పరంగా ఎలా ఉంటారు అన్నది ప్రేమ రాశిఫలాలు 2025 లో తెలియజేస్తాము. కొత్త సంవస్త్రం ప్రారంభం అవుతుంది కాబట్టు ప్రేమకి సంబంధించి మనందరికీ అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రేమ ఈ సంవస్త్రం నా జీవితంలో ఉనికిని అనుభవిస్తుందా? నేను ప్రేమ కోసం ఇంకా ఎంత కాలం వేచి ఉండాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఆధారంగా మేము మీకు ఈ ప్రత్యేక వ్యాసాన్ని సిద్దం చేశాము, ఇక్కడ మీరు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను కనుగొనవొచ్చు.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: प्रेम राशिफल 2025
ఇంకా ముందుకు సాగే ముందు, ఈ ప్రత్యేక ఆర్టికల్ లో వైదిక జ్యోతిషశాస్త్రం పైన ఆధారపడిందని మరియు అన్ని గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలు, స్థానాలు ఇంకా సంచారాలను పరిగణలోకి తీసుకొని మన పండితులు మరియు జ్ఞాన జ్యోతిష్కులచే రూపొందించబడిందని దయచేసి గమనించగలరు. ఆలస్యం చేయకుండా ప్రేమ జాతకం 2025 పైన మా ప్రత్యేక కథనాన్ని ప్రారంభిద్దాం మరియు ప్రేమ పరంగా మేషరాశి నుండి మీనరాశి వరకు వ్యక్తులకు కొత్త సంవత్సరం ఎటువంటి బహుమతులు లేకపోతే సమస్యలను కలిగిస్తుందో తెలుసుకుందాం.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
జ్యోతిష్యశాస్త్రంలో ప్రేమ మరియు గ్రహాల మధ్య సంబంధం
జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ప్రేమ గ్రహంగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉన్నప్పుడు,ఆ వ్యక్తుల జీవితంలో ప్రేమ ఉంటుందని జ్యోతిష్యుల యొక్క నమ్మకం. దీనికి విరుద్ధంగా రాహువు, కుజుడు లేకపోతే శనితో శుక్రుడి కలయిక సంబంధాలకు ప్రతికూలంగా కనిపిస్తుంది. శుక్రుడితో పాటు ఉండటం సంబంధాలలో విడిపోయే అవకాశాన్ని పెంచుతుందని గమనించడం ముఖ్యం.
Read in English: Love Horoscope 2025
వైదిక జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు మరియు జాతకంలో ఐదవ ఇల్లు ప్రేమకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదనంగా శని, రాహువు మరియు కేతువు గ్రహాలు సంబంధాలలో అంతరాయాలను కలిగిస్తాయి. మూడవ, ఏడవ, పదకొండవ ఇల్లు కొరికలతో ముడిపడి ఉండగా పన్నెండవ ఇల్లు లైంగిక ఆనందానికి సంబంధించినది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో శుక్రుడు, కుజుడు, రాహువు ఆరో స్థానంలో ఉంటే భాగస్వామితో విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎనిమిదవ ఇంట్లోని ఏ గ్రహం అయినా సంబంధాలలో గణనీయమైన సమస్యలను కలిగిస్తుంది. కేతువు ఏడవ ఇంట్లో ఉంటే అది ప్రేమ సంబంధాలలో బ్రేక్అప్ కు దారితీయదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా శుక్రుడు ప్రేమకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడుతుంది, కాబట్టి జాతకంలో శుక్రుడి మంచి స్థానం విజయవంతమైన ప్రేమను సూచిస్తుంది. శుక్రుడితో పాటు చంద్రుని అనుకూల స్థానం ప్రేమ సంబంధానికి కీలకం.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
మేషరాశి
మేషరాశి స్థానికులు ఈ సంవత్సరం ప్రేమ రాశిఫలాలు 2025 ప్రకారం మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. జనవరి నుండి మార్చి నెల వరకు ఐదవ ఇంటి పైన శని యొక్క అంశం వారి సంబంధాల గురించి సీరియస్ గా లేనివారికి ఇబ్బందులను కలిగిస్తుంది. అదనంగా మే నెల తర్వాత మీ సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు. మీ సంబంధంలో మరియు మీ భాగస్వామితో నమ్మకాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. వివాహితులకు 2025 మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు వివాహ వయస్సుకి వస్తే, వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లయితే, ఈ సంవత్సరం మీరు వివాహానికి సంబంధించి శుభవార్తను అందుకుంటారు.
వృషభరాశి
వృషభరాశి స్థానికులు ఈ సంవత్సరం ప్రేమ రాశిఫలాల పరంగా మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. జనవరి నుండి మే నెల వరకు మీ ఐదవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ సంబంధాలలో అప్పుడప్పుడు అపార్థాలు ఏర్పడతాయి. ఏదేమైనా మే నెల మధ్య వరకు ఐదవ ఇంటి పైన బృహస్పతి యొక్క అంశం ఈ అపార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికి, అవి కాలక్రమేణా క్రమంగా పరిష్కరించబడతాయి. ఈ సంవత్సరం మీరు మీ భాగస్వామికి మీ ప్రేమను స్పష్టంగా వ్యక్తీకరించాలి మరియు వారి పైన నమ్మకాన్ని కొనసాగించాలి. వివాహం అయిన వారికి వృషభరాశి వారకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే మీ వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. వివాహ వయస్సు ఉన్నవారికి లేకపోతే వివాహం చేసుకోవాలనుకునేవారికి, ఈ సంవత్సరం సానుకూల ఫలితాలను ఇస్తుంది. 2025 నిశ్చితార్థాలు, వివాహాలకు అనుకూలంగా ఉంటుంది.
మిథునరాశి
రాశిచక్రంలో మూడవ రాశి అయిన మిథునరాశి వారికి ప్రేమ జాతకం 2025 ఈ సంవత్సరం సగటు కంటే మెరుగైన ఫలితాలను అంచనా వేస్తుంది. మీ ఐదవ ఇంటి పైన ప్రతికూల గ్రహ ప్రభావాలు లేకుండా, మీ ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీరు జనవరి నుండి మే నెల మధ్య వరకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, కాని మిగిలిన సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. వివాహిత మిథునరాశి వారికి శని సంచారం కొన్ని సమస్యని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీరు చిన్న సమస్యలను పెంచుకుంటారు. మొత్తం మీద మార్చి నెల తర్వాత శని పదవ అంశం ఏడవ ఇంటి పైన ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాహ వయస్సు ఉన్నవారికి లేదా వివాహం చేసుకోవాలనుకునేవారికి ఈ సంవస్త్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత మీరు ప్రేమ వివాహం చేసుకోవచ్చు ఇంకా మీ కుటుంబం ఎంచుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు.
మిథునం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి
Read in English: Love Horoscope 2025
కర్కాటకరాశి
కర్కాటరాశి వారు ఈ 2025 సంవత్సరంలో ప్రేమ విషయాలలో అనుకూల ఫలితాలను ఆశించవచ్చు. మార్చి నెల తరువాత శని ప్రభావం ఐదవ ఇంటి నుండి దూరంగా వెళ్తుంది మీ సంబంధంలో ఏవైనా చిన్న విభేదాలు లేదా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మే నెలలో బృహస్పతి సంచారం మీ బంధానికి మరింత సానుకులతను తెస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. వైవాహిక సంబంధాలకు సంబంధించి ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి సంవత్సరం ప్రథమార్ధం ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ వయస్సులో ఉన్నవారికి ఈ సంవస్త్రంలో ప్రారంభ నెలలు శుభవార్తను తెస్తాయి. మీరు ప్రేమలో ఉనట్టు అయితే లేదా ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే ఈ విషయంలో ముందు అడుగు వేయడం మంచిది.
సింహరాశి
సింహారాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ పరంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. జనవరి నెల నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి మీ వృత్తి గృహంలో ఉంటారు, ఇది వారి భాగస్వామితో నిజంగా ప్రేమలో ఉన్నవారికి లేదా సహోద్యోగులతో సంబంధాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ప్రేమ రాశిఫలాలు 2025 సమయంలో ప్రకారం మే నెల మధ్య తరువాత బృహస్పతి సంచారం మీ సంబంధంలో సానుకూలతను మరింత పెంచుతుంది. అప్పుడప్పుడు సమస్యలు తలెత్తినప్పటికి మీ సంబంధం మరియు భాగస్వామి పైన నమ్మకాన్ని కొనసాగించడం విషయాలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. వివాహితులైన సింహారాశి వ్యక్తులకు ఈ సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ చిన్న సమస్యలు ఇంకా సంభవించవచ్చు. ఈ సమస్యలు ఓర్పుతో ఎదుర్కోవడం మంచిది. వివాహం చేసుకోవాలనుకునే వారికి మే నెల మధ్య తరువాత సానుకూల ఫలితాలు రావచ్చు.
సింహం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి
మీ చంద్రరాశిని తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: మూన్ సైన్ కాలిక్యులేటర్ !
కన్యరాశి
కన్యరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం ప్రేమలో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. శని సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు మీ ఆరవ ఇంట్లో ఉంటాడు, ఇది సాధారణంగా ప్రేమకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది. అయితే అప్పడప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మార్చి నెల తరువాత మే లో బృహస్పతి సంచారం మీ సంబంధానికి మరింత సానుకూలతను తెస్తుంది, ఇది మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వివాహిత కన్యరాశి స్థానికులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాబోయే రాహు మరియు కేతువుల సంచారం అపార్థాలను పరిష్కరించడానికి మరియు మీ సంబంధం యొక్క మాధుర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. వివాహం చేసుకోవాలనుకునేవారికి సంవస్త్రం ప్రథమార్ధం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే లేకపోతే మీ భాగస్వామిని మీ కుటుంబానికి పరిచయం చేయాలనుకుంటే, సంవత్సరం ప్రారంభంలో ఈ చర్యలు తీసుకోవడం మంచిది.
తులారాశి
తులారాశి ఫలాలు 2025 ప్రకారం ఈ వ్యక్తులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని మీ ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తాడు. మార్చి నెల తరువాత శని ప్రభావం ఐదవ ఇంటి నుండి దూరంగా వెళ్తుంది, మీ సంబంధంలో అపార్థాలు మరియు సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది. మే నెల మధ్య తర్వాత బృహస్పతి ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం అపార్థాలను పరిష్కరించడానికి మరియు మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన పరిస్థితులను తీసుకురావడానికి మరింత సహాయపడుతుంది. వివాహితులైన తులారాశి వారికి మార్చి వరకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏదేమైనా మీ సంబంధలో మరింత సామరస్యంతో మార్చి తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. వివాహ వయస్సులో ఉన్నవారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, మరియు మీరు నిశ్చితార్ధం లేదా వివాహానికి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి
ప్రేమ జాతకం 2025 ప్రకారం వృశ్చికరాశి వ్యక్తులు ఈ సంవత్సరం వారి ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ సంబంధంలో అపార్థాలు పరిష్కరించబడే అవకాశం ఉంది ఇంకా మే తర్వాత మీ బంధం బలపడుతుంది, మార్చి నెల తర్వాత శని ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం మీ శృంగార సంబంధాలకు కొంత దృఢత్వాన్ని తెస్తుంది. తమ భాగస్వాముల గురించి సీరియస్ గా ఉన్నవారికి ఈ సంవత్సరం ఇంకా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ రాశిఫలాలు 2025 లోబృహస్పతి సంచారం మీ సంబంధాన్ని మరింత పూర్తిగా ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వివాహిత వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం మొదటి భాగం మరింత అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వివాహ వయస్సులో ఉన్నవారికి 2025 చిరస్మరణీయ సంవత్సరం మరియు మీరు ప్రేమ వివాహంలోకి ప్రవేశించవచ్చు.
వృశ్చికం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
ధనుస్సురాశి
ధనుస్సురాశి వ్యక్తులు ఈ సంవత్సరం ప్రేమ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఏదేమైనా మే నెల మధ్య తరువాత బృహస్పతి ఏడవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ సంబంధాలలో మరింత సామరస్యాన్ని అనుభవిస్తారు ఇంకా సగటు ఫలితాలను పొందుతారు. శుక్రుడు ఏడాది పొడవునా అనుకూల ఫలితాలను అందిస్తాడు. చిన్న చిన్న వివాదాలను కూడా సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించారు. వివాహితులకు మొదటి సగంతో పోలిస్తే 2025 ద్వితీయార్ధం మరింత అనుకూలంగా ఉంటుంది, ఇది మీ భాగస్వామితో మరింత సామరస్యాపూర్వక సంబంధానికి దారితీస్తుంది. వివాహ వయస్సులో ఉన్నవారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధం మరింత ముఖ్యమైనది అలాగే మీరు శుభవర్తలను అందుకుంటారు మే నెల తర్వత అవకాశాలు బలంగా ఉంటాయి.
ధనుస్సు రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
రాజ్ యోగా సమయం తెలుసుకోవడానికి, ఇప్పుడే ఆర్డర్ చేయండి: రాజ్ యోగా నివేదిక !
మకరరాశి
మకరరాశి వారికి 2025 సంవత్సరం ప్రేమ రాశిఫలాల పరంగా ప్రథమార్ధం చిరస్మరణీయంగా ఉంటుంది. జనవరి నుండి మార్చి నెల వరకు, మీరు మీ ప్రేమ జీవితంలో అనుకూల ఫలితాలను అనుభవిస్తారు అలాగే మీ సంబంధాలు బాలపడుతాయి. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటిని తెలివిగా నిర్వహించడం వల్ల మీ బంధం మరింత బాలపడుతుంది. ప్రేమ రాశిఫలాలు 2025పరంగా మే నెల మధ్య తరువాత బృహస్పతి మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశించడం, ఐదవ ఇంటి పైన శని యొక్క స్థిరమైన అంశం మీ సంబంధానికి కొంత చల్లదనాన్ని తెస్తుంది. వివాహితులైన మకరరాశి వ్యక్తులకు సంబంధంలో సామరస్యానికి విఘాతం కలిగించే విభేదాలను నివారించడానికి ఈ సంవత్సరం అదనపు ప్రమత్తత అవసరం. వివాహ వయస్సు ఉన్నవారు సంవత్సారం ప్రథమార్ధంలో వివాహ సంబంధ విషయాలను పరిష్కరించే ప్రయత్నాలు చేయడం మంచిది.
మకరం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
కుంభరాశి
కుంభరాశి రాశిచక్రం యొక్క 11వ రాశి అయిన స్థానికులకు, ప్రేమ జాతకం 2025 ప్రేమలో ఉన్నవారికి సగటు కంటే మెరుగైన ఫలితాలను అంచనా వేస్తుంది. శుక్రుడి సంచారం సంవత్సరంలో ఎక్కువ భాగం అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఐదవ ఇంటి పైన ప్రతికూల గ్రహ ప్రభావం లేకుండా మీ ప్రేమ సంబంధం సానుకూలంగా ప్రయోజనం పొందుతుంది. మే నెల తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా పెద్దగా సమస్యలు తలెత్తవని భరోసా ఇచ్చారు. బృహస్పతి సంచారం తరువాత మీరు మీ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. వివాహితులకు వివాహం చేసుకోవాలనుకునేవారికి ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం చాలా ముఖ్యమైనదిగా పరిగమనించబడుతుంది. ఏప్రిల్ నుండి మే నెల వరకు వివాహిత జంటలు కొంత సామరస్యాన్ని అనుభవిస్తారు కాని తరువాత, ఏడవ ఇంటి పైన రాహువు మరియు కేతు ప్రభావం కొన్ని సమస్యలను తీసుకురావచ్చు. మొత్తంమీద ఈ సంవత్సరం అనుకూలమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మీ వంతుగా అదనపు శ్రమ అవసరం.
కుంభం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!
మీనరాశి
మీనరాశి స్థానికులకు 2025 సంవస్త్రంలో ప్రేమ జాతకం ప్రకారం ఐదవ ఇంటి పైన ప్రతికూల గ్రహ ప్రభావం లేకుండా సంవత్సరంలో ఎక్కువ భాగం ప్రేమ సంబంధాలకు అనుకూలంగా పరిగణించబడుతుంది. మే నెల మధ్య వరకు రాహువు ప్రభావం మీ సంబంధంలో చిన్న చిన్న అపార్ధలు మరియు చిన్న చిన్న సమస్యలు ఉండవు, మరియు మీరు మీ ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు. మే నెల మధ్య తరువాత రాహు ప్రభావం ఐదవ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇది మిమ్మల్ని మరింత ఆనందకరమైన మరియు సంతృప్తికరమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి అనుమతిస్తుంది. ప్రేమ రాశిఫలాలు 2025 పరంగా వివాహితులైన మీనరాశి వారు సంవత్సరం జాగ్రత్తగా ఉండటం మంచిది. సంవత్సరం ప్రథమార్ధంలో ఏడవ ఇంటి పైన రాహువు మరియు కేతువుల ప్రభావం మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తీసుకురావచ్చు. బృహస్పతి యొక్క అంశం ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది, కాని మీ వైపు ప్రయత్నం అవసరం. వివాహ వయస్సులో ఉన్నవారికి అనుకూల ఫలితాలను సాధించడానికి కృషి అవసరం, అప్పుడే మీరు వివాహం చేసుకోవడంలో విజయం సాదిస్తారు.
మీనం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
తరచుగా అడిగిన ప్రశ్నలు
1. 2025లో ప్రేమ పరంగా ఏ రాశివారు అదృష్టవంతులు?
కర్కాటక, మకర, మీనరాశుల వారికి 2025 లో ప్రేమ పరంగా అద్భుతమైన సంవత్సరం ఉంటుంది.
2. తులారాశి వారికి ఏమి ఉంది?
ప్రేమ జాతకం 2025 ప్రకారం తులారాశి వ్యక్తులు 2025 లో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.
3. 2025 లో మేషరాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
ప్రేమ పరంగా మేషరాశి ప్రేమికులు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు, ఈ రాశికి చెందిన వివాహిత వ్యక్తులు అద్భుతమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది.
4. జ్యోతిష్యశాస్త్రంలో ఏ గ్రహాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు?
జ్యోతిషస్త్రంలో శుక్రుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025