జన్మాష్టమి 22 తేది గురించి గందరగోళంగా ఉందా? ఈ ప్రత్యేక యోగాలలో జన్మాష్టమిని జరుపుకొండి!
హిందూ పురాణాల ప్రకారం, భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రం సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు అని నమ్ముతారు.కాబట్టి, ప్రతి సంవస్త్రం భాదోన్ మాసంలో, కృష్ణ పక్షం 8వ రోజున, కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు.2022 సంవస్త్రంలో , కృష్ణ జన్మాష్టమి యొక్క ఈ ఆధ్యాత్మిక పండుగ ఆగష్టు 18 లేదా ఆగష్టు 19 న జరుపుకుంటారు.
ఈ రోజు కృష్ణ భక్తులకు చాలా ప్రత్యేకమైనది, ముఖ్యమైనది మరియు సంతోషకరమైనది. ఈ రోజున, ప్రతి వ్యక్తి శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందేందుకు పూజలు మరియు ఇతర ఆచారాలు చేయడం ద్వారా భగవంతుడిని సంతోశపరుస్తారు.కాబట్టి, ఈ ప్రత్యేక బ్లాగ్ సహాయంతో ఆస్ట్రోసేజ్, మీ జీవితంలో శ్రీ కృష్ణ భగవానుని ఆశీర్వాదాలను పొందడంలో మీకు ఎలాంటి నివారణలు సహాయపడతాయో మేము మీకు తెలియజేస్తాము.
అంతేకాకుండా, ఈ సంవస్త్రం జన్మాష్టమికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఈ రోజున పవిత్రమైన యోగా నిర్మాణం గురించి సమాచారం, ఈ రోజు పూజలో ఏ విషయాలు ఉండాలి మరియు ఈరోజు చేయవలసినవి ఇంకా చెయ్యకూడనివి వంటి ఇతర ముఖ్య వివరాలతో మేము మీకు తెలియజేస్తున్నాము.కాబట్టి, ఇలాంటి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తెలుసుకోవాలి అంటే ఈ బ్లాగ్ ని చివరి వరకు చదవండి.అనింటిలో మొదటిది, జన్మాష్టమి శుభ దినం ఎప్పుడు వస్తుంది, మరియు శుభ ముహూర్తం ఎలా ఉంటుంది?
ప్రతి సమస్యకు పరిష్కారం పొందడానికి, ఉత్తమ జ్యోతిష్కునితో
జన్మాష్టమి 2022: తిథి& శుభ ముహూర్తం
18( వైష్ణవ విశ్వాసులు)& 19 ఆగష్టు( స్మార్త విశ్వాసులు)2022 ( గురువారం- శుక్రవారం) జన్మాష్టమి ముహూర్తం( 19 ఆగష్టు- 2022)
నిశిత పూజ ముహూర్తం: 24:03:00 నుండి 24:46:42 వరకు
సమయం వ్యవధి: 0 గంట 43 నిమిషాలు
జన్మాష్టమి పరణ ముహూర్తము:05:52:03 తర్వాత, ఆగష్టు 20న
ప్రత్యేక సమాచారం:పై ముహూర్తాలు అన్ని స్మార్త్ మాట ప్రకారం అందించబడ్డాయి.వైష్ణవ మరియు స్మార్త్ సమాజాన్ని విశ్వసించే వ్యక్తులు వేర్వురు నియమాలతో జరుపుకుంటారని గుర్తించుకోండి.
ఆగష్టు 18, గురువారం, వృద్ది యోగం ఏర్పడే శుభ యాదృశ్చికం ఉంది. ఇది కాకుండా,మనం జన్మాష్టమి నాడు అభిజిత్ ముహూర్తం గురించి మాట్లాడినట్టు అయితే, అది ఆగష్టు 18 మధ్యానం 12:05 నుండి 12:56 వరకు ప్రారంభమవుతుంది.దీనితో పాటు, వృద్ది యోగా ఆగష్టు 17వ తేది రాత్రి 8:56 గంటలకు ప్రారంభమై ఆగష్టు 18వ తేది రాత్రి 8:41 గంటలకు ధ్రువ యోగం ప్రారంభమై ఆగష్టు 19వ తేది రాత్రి 8:59 వరకు కొనసాగుతుంది.
అంటే ఈ సంవస్త్రం కృష్ణ జన్మాష్టమి 2 రోజులు 18 మరియు 19 తేధిలలో జరుపుకుంటారు మరియు రెండు రోజులలో యాద్రుశ్చిక శుభ యోగాలు ఉంటాయి.
మీ కెరీర్ & విద్యలో విజయం సాధించడానికి: మీ కాగ్నిఆస్ట్రో నివేదికను ఇప్పుడే ఆర్డర్ చేయండి!
కృష్ణ జన్మాష్టమి పూజలో ఈ మంత్రాల ప్రాముఖ్యత
హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా విశిష్టత ఉంది.ఈ రోజున,ప్రజలు తమ జీవితాలలో శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదాలను పొందాలని పూజిస్తారు.అలాగే ఈ చాలా మంది ఈ రోజున ఉపవాసం పాటిస్తారు.ఈ రోజు రాత్రి పూజ ప్రారంభమవుతుంది.
ఇది మాత్రమే కాదు, వారి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న స్తానికులకు జన్మాష్టమి ఉపవాసం పుణ్యఫలం కంటే తక్కువ కాదని చెప్పబడింది.ఇది కాకుండా, సంతానోత్పత్తికి కూడా ఈ ఉపవాసం చాలా ప్రభావంతంగా మరియు ఫలవంతంగా ఉంటుంది.కాబట్టి,మీరు ఏ మంత్రాలతో కృష్ణ జన్మాష్టమి పూజను మరింత పవిత్రంగా చేయగలరో మరియు మీ జీవితంలో మంచి ఫలితాలను పొందొచ్చో తెలుసుకుందాము.
శుద్ధి మంత్రం: ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తం గతో??పి వా యః స్మరేత పుండరీకాక్షంస బాహ్యభ్యంతరాః శుచిః”
స్నాన మంత్రం: ”గంగ, సరస్వతి, రేవా, పయోషి నర్మదాజలై స్నాపితోసి మాయా దేవా తథా శాస్తి కురుశ్యమే.”
పంచామృత స్నానం: పంచామృత మాయానితం పయోధది ఘృతం మధు.శర్కారా చసమాయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యాతాం…”
శీకృష్ణ భాగవానుడికి బట్టలు సమర్పించే మంత్రం
“శీతవతోష్ణసంత్రాణం లజ్జాయ రక్షణం పరం.దేహలాంగకరణం వస్త్రమతః శాంతింప్రయచ్చ మే”
భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించండి.
“ఇదా నానా విధి నైవేద్యాని ఓమ నమో భగవతే వాసుదేవం, దేవకీసుతం సమర్పయామి.”
భగవంతుడికి నీటిని సమర్పించండి
ఇదమ్ ఆచమానం ఓమ నమో భగవతే వాసుదేవం, దేవకీసుతం సమర్పయామి.”
జన్మాష్టమి పూజలో ఈ విషయాలను చేర్చండి,లేకపోతే పూజ అసంపూర్ణంగా ఉంటుంది
ఏదైనా పూజలో కొన్ని ప్రత్యేక పదార్థాలను చేర్చడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ పదార్థాలు లేకుండా నిర్దిష్ట పూజ చేస్తే సాదారణంగా పూజ అసంతృప్తిగా ఉంటుందని మరియు అందువల్ల ఫలించదని చెప్పబడింది.కాబట్టి కృష్ణ జన్మాష్టమి యొక్క పవిత్రమైన వేడుకలో ఎలాంటి తప్పులు చేయవద్దు, ఆచారాలు మరియు జన్మాష్టమి పూజలో ఏ ప్రత్యేక పదార్థాలు చేర్చాలో తెలుసుకుందాము.
- ఈ రోజున పూజలో వేణువును చేర్చండి ఎందుకంటే ఇది శ్రీకృష్ణుడికి ఇష్టమైన విషయం మాత్రమే కాదు, ఇది సరళత మరియు మాధుర్యాన్ని సూచిస్తుంది.
- ఇది కాకుండా,ఈ రోజున శ్రీకృష్ణుడితో పాటు ఆవు విగ్రహాన్ని కూడా పెట్టండి.
- మీరు శ్రీ కృష్ణ భగవానుడికి సమర్పించబోయే దానిలో తులసిని చేర్చండి.
- ఈరోజు నెమలి ఈకలను పెట్టుకోవాలి.ఇది ఆనందం, ఆకర్షణ మరియు గొప్పతనాన్ని సూచిస్తుంది.
- ఇది కాకుండా,ఈ పవిత్రమైన రోజున వెన్న మరియు చెక్కర చేర్చండి, ఎందుకంటే వెన్న మరియు పంచదార రెండూ లడ్డు గోపాలుడికి ఇష్టమైనవి.
- జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడి పిల్లల రూపానికి అంకితం చేయబడింది.కాబట్టి,పిల్లల కోసం చిన్న శిశువు ఊయల లేదా ఊయలని చేర్చండి.
- శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడూ వైజయంతి మాలను ధరిస్తాడు మరియు అందుకే కృష్ణ జన్మాష్టమికి పూజలో అతనికి వైజయంతి మాల ధరించేలా చేయడం మర్చిపోవొద్దు
- ఈ గంట కాకుండా, రాదా కృష్ణుడి చిత్రం, గుండ్లు మరియు పసుపు మెరిసే బట్టలు ఆచారాలు లేదా పూజలో చేర్చాలి.
ఇప్పుడు, ఆన్లైన్ పూజ ద్వారా ఇంట్లోనే నేర్చుకున్న పురోహితుడి దెగ్గర ఆరాదించండి & శుభ ఫలితాలను పొందండి.
జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి ఈ వస్తువులు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!
శ్రీ కృష్ణ భగవానుడు నారాయణుని 8వ అవతారంగా భావిస్తారు.శ్రీ కృష్ణ భగవానుడు ఆకర్షితుడు అయితే ఆ వ్యక్తికి సంపద, సంతోషం - జీవితంలో శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు.కాబట్టి, జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణుని అనుగ్రహాన్ని పొందేందుకు మీరు శ్రీ కృష్ణుడికి ఏమి సమర్పించవొచ్చు?
మేషం: ఈ రాశికి చెందిన వారు శ్రీ కృష్ణుడికి ఎర్ర బట్టలు ధరించేలా చేసి వెన్న మరియు పంచాదర సమర్పించండి.
వృషభం: స్తానికులు శ్రీ కృష్ణుడిని వెండితో అలంకరించి వెన్న సమర్పించాలి.
మిథునం:శ్రీ కృష్ణుడిని లేహ్రియ దుస్తులు ధరించేలా చేయండి మరియు పెరుగును సమర్పించండి.
కర్కాటకం: శ్రీకృష్ణుడికి తెల్లని వస్త్రాలు ధరించేలా చేసి పాలు మరియు కుంకుమపువ్వు ని సమర్పించండి.
సింహం:శ్రీకృష్ణుడు గులాబి రంగు దుస్తులు ధరించేలా చెయ్యండి మరియు వెన్న మరియు పంచదార సమర్పించండి.
కన్య: ఈ రాశివారు శ్రీ కృష్ణుడిని ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించేలా చేస్తారు మరియు మావా బర్ఫీని అందించండి.
తులారాశి: శ్రీ కృష్ణుడు గులాబీ లేదా కుంకుమపువ్వు రంగు దుస్తులు ధరించేలా చేసి వెన్న మరియు పంచదార సమర్పించండి.
వృశ్చికం: శ్రీ కృష్ణుడిని ఎరట్టి బట్టలు ధరించేలా చేసి మావా వెన్న లేదా నెయ్యి సమర్పించండి.
ధనుస్సు:కృష్ణుడు పసుపు రంగు దుస్తులు ధరించేలా చేయండి మరియు పసుపు రంగులో ఉన్న స్వీట్లను అతనికి అందించండి.
మకరం: ఈ స్తానికులు నారింజ రంగు బట్టలు మరియు పంచదారను భోగగా అందించాలి.
కుంభం: శ్రీ కృష్ణుడు నీలి రంగు బట్టలు ధరించేలా చేయండి మరియు బలు షాహిని
సమర్పించండి.
మీనం: శ్రీ కృష్ణుడిని పీతాంబరి ధరించేలా చెయ్యండి మరియు కేసరి ఇంకా మావాను సమర్పించండి.
మీకు తెలుసా?శ్రీ కృష్ణుడికి చప్పన్ భోగ్ ని ఎందుకు సమర్పిస్తారు?
హిందూ మతంలో, చాలా కాలంగా దేవతలకు భోగ్ సమర్పించే ఆచారం ఉంది.వేర్వేరు ప్రభువులకు వేర్వేరు భోగ్ ఉంది.కాబట్టి, మనం శ్రీకృష్ణుని గురించి మాట్లాడినట్టు అయితే, అతనికి చప్పన్ భోగ్ అందించబడుతుంది.ఇప్పుడు శ్రీ కృష్ణ భగవానుడికి చప్పన్ భోగ్ ఎందుకు సమర్పిస్తారు?రండి,దీని వెనుక ఉన్న కారణాన్ని కృష్ణ జన్మాష్టమి శుభ సందర్బంగా అర్ధం చేసుకుందాం.పురాణాల ప్రకారం,యశోద తల్లి చిన్నతనంలో శ్రీకృష్ణుడికి రోజుకు 8 సార్లు తినిపించేదని చెబుతారు.ఒకప్పుడు ఊరి ప్రజలంతా ఇంద్రదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కార్యక్రమాల నిర్వహించేవారు.అప్పుడు శ్రీకృష్ణుడు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నాడు అని నందబాబాను అడిగాడు.ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని ,మన పంటలు మంచి స్తితిలో ఉండేలా ఆయన సంతోషిస్తే వర్షం కురిపిస్తానని నంద దేవ్ అతనికి వివరించాడు.
రాజ్ యోగా సమయం తెలుసుకోవడానికి, ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి:రాజ్ యోగా నివేదిక!
దీనికి శ్రీ కృష్ణుడు అడిగాడు, ఇంద్ర దేవుడి పని వర్షం కురిపించడమే. మేము అతనిని పూజిస్తాము.మనకు పండ్లు మరియు కూరగాయలు లభించే గోవర్ధన పర్వతాన్ని ఎందుకు పూజించాకుడదు? మరియు మన పెంపుడు జంతువులు కూడా మేతను పొందుతాయి.పిల్లవాడు చెప్పేదానికి ప్రతి వ్యక్తి ఏకిభవిస్తున్నాడు, ఇంద్ర దేవుడిని పూజించినప్పటికీ అందరూ గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు.
ఇంద్ర దేవుడు దీని గురించి చాలా బాధ పడ్డాడు మరియు కోపంతో, అతను భారి వర్షం కురిపించాడు.గోకులంలోని పేద ప్రజలను ఇంద్ర దేవుడి యొక్క భారి వర్షాల కోపం నుండి రక్షించడానికి, శ్రీ కృష్ణుడు 7 రోజులు పాటు ఏమి తినకుండా గోవర్ధన పర్వతాన్ని తన వేలి పై మోసాడు అని చెబుతారు.చివరగా వర్షం ఆగి, అందరు పర్వతం నుండి బయటకు వచ్చినప్పుడు కహ్న దెగ్గర 7 రోజులు ఏమి లేకపోవడం గమనించారు.
అప్పుడు తల్లి యశోద 7 రోజుల పాటు 8 సన్నాహాల ప్రకారం 56 రకాల సన్నాహాలు చేసింది మరియు అప్పటినుండి 56 భోగ్ లేదా చప్పన్ భోగ్ యొక్క ఈ పవిత్రమైన మరియు ఆసక్తికరమైన ఆచారం ప్రారంభం అయ్యింది.
లడ్డూని గోపాలుడికి భోగ్ గా అందిస్తునప్పుడు ఈ విషయాలను గుర్తించండి.
కృష్ణ జన్మాష్టమి రోజున మాత్రమే కాకుండా సాదారణంగా లడ్డూ గోపాలుడికి భోగ్ గా సమర్పించాలి.అయితే,భోగ్ అందించడానికి కొన్ని నియమాలను పాటించాలి.ఈ నియమాలు ఏమిటి?శ్రీ కృష్ణుని అనుగ్రహాన్ని పొందడానికి కృష్ణ జన్మాష్టమి నాడు ఈ నియమాలను పాటించండి.
- మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే గోపాలుడికి మొదటి భోగ్ యొక్క లడ్డూను అందించండి.సాదారణంగా,మీరు ఈ భోగ్ ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్య అందించావొచ్చు.ఈ సమయంలో గోపాలుడిని సున్నితంగా చపట్టు కొట్టి నిద్రలేపి, అతనికి పాలు అందించాలి.దానిని తర్వాత మీరు ఉపయోగించుకోవొచ్చు.
- అతనికి స్నానం చేసిన తర్వాత 2వ భోగ్ ను అందించండి.ఈ సమయంలో అతనికి శుభ్రమైన దుస్తులు ధరించి, తిలకం పెట్టండి.ఈ భోగ్ లో, మీరు కృష్ణుడికి వెన్న, పంచదార మరియు లడ్డూలను సమర్పించవొచ్చు లేదా మీకు కావాలంటే మీరు ఈ సమయంలో అతనికి పండ్లు కూడా సమర్పించవొచ్చు.
- గోపాలుడికి 3వ భోగ్ ను మధ్యానం సమర్పించాలి.ఈ సమయంలో,మీరు వారికి ఏదైనా ఘనమైన ఆహార పదార్థాలను అందించవొచ్చు.అయితే,పొరపాటున కూడా ఈ భోగ్ ఆహారంలో ఉల్లిపాయ వెల్లులిని ఉపయోగించకూడదని గుర్తించుకోండి.
- 4వ భోగ్ ఇంకా చివరి భోగ్ ను సాయంత్రం సమర్పిస్తారు.ఇందులో శ్రీ కృష్ణ భగవానుడికి మావను నైవేద్యంగా పెట్టి రాత్రి గోపాలుడికి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టవొచ్చు.
జన్మాష్టమి నాడు చేయవలసినవి & చేయకూడనివి
చివరగా,కృష్ణ జన్మాష్టమి నాడు చేయవలసినవి మరియు చేయాకుడనివి తెలుసుకుందాము.
- ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు పంచామ్రుతాన్ని సమర్పించడానికి నిర్దారించుకోండి.
- భోగ్ లో తులసి మొక్కలను చేర్చండి.
- శ్రీ కృష్ణుడు కొత్త బట్టలు ధరించేలా చేయండి.
- పూజ సమయంలో ఎలప్పుడూ శుబ్రమైన పాత్రలను ఉపయోగించండి.ఈ పాత్రలలో మాంసాహారం ఎప్పుడూ వండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
- కృష్ణ జన్మాష్టమి రోజున, తులసి మొక్కను ఎరట్టి చున్నితో కప్పి,నెయ్యి దీపాన్ని వెలిగించండి.
- ఈరోజు పూజను రాతిరి పూట చెయ్యాలి.
- ఈరోజున ఎవరిని బాధపెట్టకూడదు మరియు తప్పుగా ప్రవర్తించకూడదు.
- చెట్లను లేదా మొక్కలను నరికి వేయకూడదు మరియు వాటిని తీయకూడదు.
- పేద ప్రజలకు సహాయం చెయ్యండి.
- కృష్ణ జన్మాష్టమి నాడు మహాలక్ష్మిని పూజించండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి:ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్
ఆస్ట్రోసేజ్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025