Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Personalized Horoscope 2025
  • Brihat Horoscope
  • Ask A Question
  • Live Astrologers
Home » 2017 » 2017 రాశి ఫలాలు Modified: January 4, 2017

2017 రాశి ఫలాలు (Rasi Phalalu 2017)

We, at AstroSage, bring you Rasi Phalalu 2017, which not only covers all the details regarding the Telugu zodiac signs, but also discusses their shortcomings as well as other things to watch out for. Further, it also provides you with remedies that would make all your problems go far away. This Telugu horoscope is completely based on the principles of Telugu astrology. It gives you freedom to understand your future prediction in a better way if you speak your native language. With Raasi Phalalu.

మీ భవిష్యత్తు ప్లాన్‌ చేసుకోవడం కొరకు 2017 రాశిఫలితాలు మీ కొరకు ఇక్కడ లభ్యం అవుతున్నాయి. ప్రాచీన వేద జోత్యిష్యశాస్త్రం యొక్క సూత్రాల ఆధారంగా, వార్షిక రాశిఫలాల ద్వారా మీ జీవితంలో జరిగే ప్రతిదానిని మీరు ఊహించవచ్చు. జీవితంలో అన్ని అంచనాలు, శని దశ లేదా దైయా ప్రభావాలు, వ్యతిరేక- సానుకూల విషయాలు, ఉచిత పరిష్కారాలు ఇవన్నింటితోపాటు ఇంకా ఎన్నో విషయాలు ఇందులో సంక్షిప్తంగా ఉన్నాయి.

గమనిక: ఈ జ్యోస్యాలు మీ జన్మరాశిపై ఆధారంగా చెప్పబడ్డాయి. మీకు మీ జన్మరాశి గురించి తెలియకపోతే, దయచేసి ఈ పేజీని సందర్శించండి - AstroSage జన్మరాశి లెక్కింపు.

మేషం (Mesha)

Mesha rasi phalalu 2017ఆకాశంలోని నక్షత్రాలు మీ కొరకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాయి. మీలో శక్తి మరియు ఉత్సాహం ప్రారంభంలో గణనీయంగా పెరుగుతాయి. ఆశ్చర్యకరంగా, మతపరమైన కార్యక్రమాల్లో మీ అంతట మీరు అమిత ఆసక్తిని పొందుతారు. అదేవిధంగా, దీర్ఘకాలిక పని ప్రణాళికలను మీరు రూపొందిస్తారు. అయితే, మీ వ్యయాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబం గురించి మాట్లాడినట్లయితే, పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ సమయంలో పూర్తి కాని అన్ని పనులు కూడా పునరుద్ధరించబడతాయి మరియు స్నేహితుడి సాయంతో పూర్తి చేయబడతాయి. 2017 రాశిఫలాల ప్రకారం, గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు ఫలితం తగ్గుతుంది, జూన్ తరువాత మీ విజయం రేటు పెరుగుతుంది. అయితే, మీకు దగ్గరి వారితో వాదనకు దిగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. కోపం తెచ్చుకోవద్దు, లేనిపక్షంలో మొత్తం నాశనం అవుతుంది. మీ ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడినట్లయితే, పిల్లలకు హటాత్తుగా పెట్టుబడులు అవసరం కావొచ్చు. సంవత్సరం యొక్క చివరల్లో, మీరు పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి మరియు మరిన్ని రూపాల్లో మీరు ఆదాయాన్ని పొందుతారు. ఒకవేళ మీరు వ్యాపారవేత్త అయితే, మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలను మీరు పొందుతారు. అయితే మీరు విశ్రాంతి కార్యకలాపాలపై ఖర్చు పెట్టవచ్చు.

మీరు కష్టపడి పనిచేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారని ఆశించబడుతోంది. అనేక విషయాలను మెరుగ్గా చేయడానికి తల్లిదండ్రులు సహాయపడతారు. కొత్త పనులకు సంబంధించిన ప్రణాళికలు చేయబడతాయి, దీని వల్ల మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీలో శక్తియుక్తులను సంవృద్ధి చేసుకోవడం ద్వారా మీతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదనంగా, మీ అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి మీరు అనేక అవకాశాలను పొందుతారు. మీ ప్రేమ జీవితంలో కొంత సంతులనం పాటిస్తే మంచిది. మీ లవర్‌కు కొంత సమయాన్ని కేటాయించి, ఇరువురూ విహారయాత్రకు వెళ్లితే మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే, మీరు నిజంగా అల్టర్‌గా ఉండాలి.

పరిష్కారం: దగ్గరల్లో ఉన్న వ్యక్తులకు సాయం అందించండి.

రేటింగ్: 4/5

వృషభం (Vrusha)

Vrusha rasi phalalu 2017ఈ ఏడాది ఉన్నతాధికారులు మరియు మహిళల నుంచి మద్దతు పొందే అవకాశం ఉన్నదని గ్రహస్థితి తెలియజేస్తోంది. సాధారణంగా డబ్బు వస్తూనే ఉంటుంది, మరియు వినోదం మరియు జీవిత సౌకర్యాల కొరకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. అయితే, హటాత్తుగా డబ్బు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే.మీ ఖర్చు కూడా పెరుగుతుంది. మీకు అనుకూలంగా లేని విషయాలు సంవత్సరం మధ్యలో సర్దుకుంటాయి. వీటన్నింటితోపాటు. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. ఊహించిన విధంగా మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. పెట్టుబడి పెట్టిన డబ్బు లాభాలను కూడా అందిస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా ఆస్తి పెట్టుబడుల వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. అవసరం లేని ఖర్చుల్ని నియంత్రించుకోవడం వల్ల మీ పొదుపు అదేవిధంగా మీ లాభాలు కూడా పెరుగుతాయి. వీటన్నింటికి అదనంగా, మీరు మీ తండ్రి మరియు మెంటార్‌ల నుంచి గౌరవం మరియు మద్దతును పొందుతారు.

మీ కుటుంబసభ్యులు అందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు. పిల్లలు కుటుంబంలో సంతోషంగా జీవించబడతారు. మీ జీవిత భాగస్వామితో సంతులనం ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించండి. అదనంగా,మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించండి. అయితే, ఈ క్లిష్టసమయంలో, చాలా తక్కువ సమయం ఉంటుంది మరియు అతి తక్కువ కాలంలో ఇవన్నీ సర్దుకుపోతాయి. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీరు కొత్త ప్రేమని పొందుతారు. మీరు ఇప్పటికే సంబందాన్ని కలిగి ఉంటే, అది మరింత బలోపేతం అవుతుంది. ఈ సంవత్సరం యొక్క చివరల్లో, ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది. కొత్త ఆదాయవనరులు కనుగొనవచ్చు. పెట్టుబడి పెట్టిన డబ్బు మీకు ప్రయోజనం కలిగించవచ్చు. అవసరం లేని ఖర్చుల్ని పరిహరించడం ద్వారా మీ పొదుపు మరియు లాభాలు పెరుగుతాయి. దీనితోపాటుగా, మీ తండ్రి మరియు మెంటార్‌లనుంచి మీరు ద్రవ్యపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, తప్పుడు జీవనశైలి వల్ల మీరు గ్యాస్, అజీర్ణం మొదలైన వాటితో బాధించబడతారు. వీటిని తేలికగా తీసుకున్నట్లయితే, తరువాత మీరు తీవ్రమైన అస్వస్థతతో బాధించబడతారు. ఈ ఏడా మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. సీజన్లలో మార్పు వల్ల మీకు సమస్యలు రావొచ్చు. అయితే, వాటి గురించి మీరు తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పరిష్కారం: తెల్లని దుస్తులు, తెల్లని సుగంధ ద్రవ్యాలు, మంచి వాసన వచ్చే తెల్లని రంగు వస్తువులు మొదలైన వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించాలి.

రేటింగ్: 3.5/5

మిధున రాశి (Mithuna)

Mithuna rasi phalalu 2017 ఏడాది ప్రారంభంలో, కుటుంబజీవితం సాధారణం ఆర్ధికాంశాలతో ఉంటుంది, స్వల్పంగా ఎత్తుపల్లాలుంటాయి. అయితే, ఏదైనా కొత్తదానిని ప్రారంభించేటప్పుడు మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. అయితే, సంవత్సరం మధ్యలో, మీరు పుణ్యాత్ములను కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. మీరు ప్లాన్ చేసిన పనులు యధావిధిగా పూర్తవుతాయి. మీ యొక్క పని నాణ్యత పట్ల మీరు ఆశ్చర్యపడతారు, మీ వెనకనుంచి మీ శత్రువులు సైతం మిమ్మల్ని పొగుడుతారు. అయితే, ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలు ఊహించబడుతున్నాయి. మీ విజయ రహస్యాన్ని తోటి కార్మికులకు చెప్పకుండా ఉండటం మంచిది. మీరు సంతోషంగా ఉండటంతోపాటుగా మీ పనుల్లో మీరు విజయం సాధిస్తారని ఆశించబడుతోంది. వ్యాపారవేత్తల గురించి మనం మాట్లాడినట్లయితే, వారి ప్రణాళికలు ఆశాజనంగా మారతాయి. అందువల్ల ధైర్యంగా ముందుకు సాగాలి. మీకు విరుద్ధంగా ఏదైనా వ్యాజ్యం వచ్చినట్లయితే, వాటిని నుంచి బయట పడే సమయం ఆసన్నమైంది. కొత్త మంచి పనులను చేయడానికి ప్రణాళిక చేస్తారు. దేవుడు, మెంటార్ మరియు మేధావుల పట్ల మీలో భక్తిభావం పెరుగుతుంది మరియు మీ మార్గంలో ఉండే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. లాటరీలు మరియు జూదం వంటి వాటికి దూరంగా ఉండే మంచిది. అదేవిధంగా, ఏదైనా గొప్పది పొందే సమయం ఇదే కనుక మీ లాభం మరియు యాజమాన్యతపై మీరు మీ హక్కుల్ని వదులుకోవద్దు. మీరు పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుతారు మరియు వ్యాపార పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు.

సంవత్సరం చివరకు అన్ని సమస్యలు పరిష్కరించబడేట్లుగా కనపడుతోంది. మీరు అదనపు ఆదాయవనరులను కొన్నింటిని పొందుతారు. ఈ ఏడాది ఖరీదైన వస్తువులను ద్రవ్యరూపంలో మీరు కొనుగోలు చేసినట్లయితే, అది మీకు లాభసాటిగా ఉంటుంది. అయితే, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ ఏడాది తెలివితేటలు అవసరం అవుతాయి. ఒకవేళ మీరు షేర్ మార్కెట్‌కు సంబంధించినట్లయితే, లాభాలు పొందడానికి కొన్ని మంచి అవకాశాలున్నాయి. ఊహాగానాల ప్రకారం, కొత్త ఆస్తి లేదా వాహనంపై మీరు పెట్టుబడి పెడతారు. డబ్బు వస్తూ ఉంటుంది కనుక మీరు పెద్దగా సమస్యల్ని ఎదుర్కొనరు. మీ ప్రేమ జీవితంలో కొంతజాగ్రత్త పాటిస్తే మంచిది. అదేవిధంగా, ఎలాంటికారణం లేకుండా జీవితభాగస్వామిని అనుమతించడం విడిచిపెట్టండి. ఒకవేళ మీరు విద్యార్థి అయితే, మీరు కాస్తంత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పనిప్రాంతంలో, మీపై పనిభారం పడవచ్చు, దీని వల్ల మీరు ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో, మీరు సహనంగా వ్యవహరించాలి. సంవత్సరం యొక్క రెండో సగభాగంలో, మీ యొక్క అన్నిసమస్యలు మాయం అవుతాయి. మీరు గౌరవాన్ని పొందుతారు మరియు మీరు కష్టపడి పనిచేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రవర్తనలో చిన్నపాటి మార్పుల ద్వారా మీ లాభాలు పెరుగుతాయి.

పరిష్కారం: తోటపని మరియు కొత్త చెట్లను నాటడం కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. దీనికి ఎంత ఎక్కువ సమయం ఇస్తే, మీకు అంత మంచిది.

రేటింగ్: 4/5

కర్కటరాశి (Kataka)

Kataka rasi phalalu 2017 ఈ ఏడాది ఏప్రిల్ వరకు మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగం చేసే వారు తమ జూనియర్‌లతో సానుకూల సంబంధాలను కలిగి ఉండాలి. కుటుంబసభ్యులు అత్యధిక సంతోషాన్ని అందిస్తారు, మీకు ప్రియమైన వారు మీకు తగిన మద్దతు ఇస్తారు. మీ కుటుంబసభ్యులతో మీరు మధురక్షణాలను గడుపుతారు. మీరు తెలివిగా పెట్టుబడి పెట్టినట్లయితే, డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం వ్యాపారాలకు కూడా మంచిది. రిస్క్ ఉండే కార్యకలాపాల్లో డబ్బు పెట్టుబడి పెట్టవద్దని మీకు సూచించబడుతోంది. ఎవరితోనైనా లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహంగా తీసుకునే ఏ నిర్ణయం వల్లనైనా మీరు బాధించబడతారు. ఇవన్ కూడా, మీ ఇంటి వద్ద పుణ్యకార్యాల్లో డబ్బును పెట్టుబడి పెట్టే అవకాశాలను మీరు పొందుతారు, కుటుంబసమస్యలు పరిష్కరించబడతాయి.

కొత్త పనులకు సంబంధించి మీరు ప్రణాళికలు రూపొందిస్తారు, దీనిలో మీరు విజయం సాధిస్తారు. జూదం,లాటరీ మొదలైన చెడ్డపనులకు దూరంగా ఉండాలి, లేనిపక్షంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. సెప్టెంబర్ తరువాత ప్రతిపనిలో మీరు అదృష్టాన్ని చవిచూస్తారు. మీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే, మీరు పేరుప్రఖ్యాతులు ప్రతిచోటకు విస్తరిస్తాయి. కొత్త స్నేహాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మీరు చేసే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేయండి, లేనిపక్షంలో మీరు మంచి అవకాశాలను కోల్పోతారు. అనేక కొత్త సంబంధాలు ఏర్పడతాయి మరియు మంచి వార్త మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. వేద జ్యోతిష్యశాస్త్రం 2017 యొక్క రాశిఫలాల ప్రకారంగా, మీకు కొత్త వనరుల నుంచి ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా, కొత్త విషయాల్లో మీకు ఆసక్తి పెరుగుతుంది. సుదూర ప్రయాణాలు చేయవద్దు. ఒకవేళ మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే, సంబంధం బలోపేతం అవుతుంది మరియు ప్రేమ భాగస్వామి మీకు అమితంగా మద్దతు అందిస్తారు. మీ పని వృద్ధి చెందే అవకాశం ఉంది మీకు రావాల్సిన డబ్బును అందుకోవడం ద్వారా మీ టెన్షన్ దూరం అవుతుంది. మీ కుటుంబంలో శాంతి మరియు సామరస్యం వ్యాప్తి చెందుతుంది. ఉద్యోగం కొరకు ప్రయత్నించే యువత ఉద్యోగాన్ని పొందుతారు. అదనంగా, ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నించే వారు సైతం కొత్త అవకాశాలను పొందుతారు.

పరిష్కారం: శుక్రవారంనాడు, పేద కుటుంబాలకు చెందిన బాలికలకు ఆహారం అందించాలి.

రేటింగ్: 3/5

సింహం (Simha)

Simha rasi phalalu 2017మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనరు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. సంవత్సరం ద్వితీయార్థంలో అపరిచితుల నుంచి సైతం మీరు అదృష్టాన్ని పొందుతారు. కష్టపడి పనిచేసిన దానికంటే మీరు ఎక్కువ సంపాదిస్తారు. వ్యాపార యజమానులు ఈ సంవత్సరం మంచి లాభాలను పొందుతారు. ఆస్తికి సంబంధించిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి మరియు తమ చుట్టూ జరిగే విషయాలపట్ల జాగ్రత్త వహించాలి. ఈ ఏడాది షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది ఊహించని లాభాలను అందిస్తుంది. అయితే, సంవత్సరం మధ్యవరకు మీరు వేచి ఉండాలి. ఒకవేళ మీ పిల్లల గురించి మాట్లాడినట్లయితే, వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. మీ ప్రేమ జీవితంలో తగిన సంతులనం పాటించండి. మీ జీవితభాగస్వామి యొక్క భావనలకు మర్యాద ఇవ్వండి. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే, చదవడం, బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ వారికి అద్భుతమైన కాలం. మీరు కాస్తంత కష్టపడినా సరే, మీరు దాని యొక్క పూర్తి ఫలితాలను పొందుతారు. టీచర్లు మీ పట్ల సంతోషంగా ఉంటారు మరియు చదువులో మీరు విజయం సాధిస్తారు. ఈ ఏడాది పనిచేసేవారికి కూడా మంచిది మీరు ఏ ఫీల్డ్‌లో పనిచేస్తున్నా సరే, మద్దతు, ప్రశంసలు మరియు మీపై ఆదరణ ఉంటాయి.

మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తవుతుంది. మీ యొక్క అన్ని టెన్షన్‌లు కూడా తగ్గుతాయి, పుణ్యకార్యాలు జరుగుతాయి. మీ ఉద్యోగానికి అదనంగా, మీరు అనేక వనరులు ద్వారా లభ్ధిని పొందుతారు. ఉద్యోగం కొరకు ప్రయత్నించే యువత ఉద్యోగాన్ని పొందుతారు. దీనితోపాటుగా, మీకున్న అద్భుతమైన మార్కెటింగ్ నైపుణ్యాల ద్వారా మీరు మీ వ్యాపారంలో మరింత లాభాన్ని పొందుతారు. మీ ప్లాన్ ప్రకారం అనుకున్నవిధంగా పనులు పూర్తవుతాయి, మీకు సంతోషంగా ఉంటారు. సింహరాశివారి 2017 రాశిఫలాల ప్రకారం పని కూడా పెరుగుతుంది. మీరు మరింత మెరుగ్గా దృష్టి సారించినట్లయితే, మీరు మరిన్ని లాభాలను పొందుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి మరియు వారితో తెలివిగా వ్యవహరించండి. బాగా నమ్మకమైన వ్యక్తి మిమ్మల్ని మోసగించవచ్చు. సుదూర ప్రయాణాలు మీకు లాభాన్ని అందిస్తాయి. మహిళలకు సైతం, ఈ ఏడాది విజయాలను అందిస్తుంది. మంచి జరిగే సమయంలో దాని నుంచి అత్యుత్తమైన దానిని పొందండి.

పరిష్కారం: మీ జీవనశైలిని మెరుగుపరుచుకోండి మరియు జంక్ ఫుడ్స్‌‌కు దూరంగా ఉండండి. ఆయిల్,వేపుళ్లు, మొదలైన ఆహార పదార్థాలు ఇందులో ఉంటాయి. అనేక ప్రాసెస్ చేయబడ్డ మరియు సంరక్షించబడ్డ పదార్థాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

రేటింగ్: 3.5/5

కన్య (Kanya)

Kanya rasi phalalu 2017 సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామ్యం నెరపడానికి ముందు తగినంత సమయం తీసుకోండి. మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని మీరు అనుకున్నట్లయితే, అనుకూలమైన సమయం కాదు. సంవత్సరం రెండో భాగం మంగళకరంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడుల గురించి ఆలోచించడం మంచిది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చదువులో సమస్య ఎదుర్కొనవచ్చు. ఉద్యోగం కొరకు చూస్తున్నవారు మరియు కెరీర్‌ని ప్రారంభించిన వారు తగిన అవకాశాలను పొందుతారు. మీడియా లేదా కళారంగానికి సంబంధించిన వ్యక్తులు లబ్ధిని పొందుతారు. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉండవు. బాస్ మరియు సీనియర్లు మీకు సపోర్ట్ చేస్తారు. సంవత్సరం చివరల్లో ప్రమోషన్ లభించవచ్చు. కుటుంబ జీవితంలో మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. మీ జీవితభాగస్వామి కొరకు కొంత సమయాన్ని కేటాయించండి మరియు చర్చించడం ద్వారా అన్ని విషయాలపై స్పష్టత ఇవ్వండి. కొత్త సంబంధాలను వెంటనే మీరు నమ్మకుండా ఉండటం మంచిది. మీ మద్దతు ద్వారా ప్రత్యర్థులు లబ్ధిని పొందుతారు మంగళకరమైన మరియు మతపరమైన వ్యవహారాల్లో మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు సమాజం,కుటుంబం మరియు వ్యాపారంలోని మీ నైపుణ్యాలకు ప్రశంసించబడతారు.

ప్రేమికుల గురించి మాట్లాడితే, వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం, అయితే, భాగస్వామిపై అనుమానం కలిగి ఉండటం మరియు కలిసి తక్కువ సమయం గడపడం వల్ల కొంతమంది సంబంధాలు దెబ్బతినవచ్చు. అయితే, పరిస్థితి నియంత్రణలోకి తీసుకురాబడుతుంది. సందేహంతో వాదనలకు దిగకుండా దానిని పరిష్కరించుకోవడం గురించే ఆలోచించాలి. ఈ ఏడాది మీ కొరకు అనేక ప్రయాణాలు ప్లాన్ చేయబడతాయి. ఈ ప్రయాణాల వల్ల మీకు లాభం కలుగుతుంది. వ్యాపారవేత్తలు వ్యాపార ప్రయోజనాల కొరకు విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం విషయం నిర్లక్ష్యంగా ఉండరాదని సిఫారసు చేయబడుతోంది. సాటిక్ డైట్ మరియు రెగ్యులర్‌గా యోగా చేయడం ద్వారా మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి. సంవత్సరం చివరల్లో మీరు ఆరోగ్యం మెరుగవుతుంది మరియు మీ యొక్క పని సామర్థ్యం సైతం పెరుగుతుంది.

పరిష్కారం: పేద పిల్లలకు పుస్తకాలు మరియు చదువును అందించాలి.

రేటింగ్: 2.5/5

తుల (Tula)

Tula rasi phalalu 2017 డబ్బు ద్వారా అన్ని విషయాలు కొనుగోలు చేయలేం, అయితే ఇంకా చాలా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆర్థికపరిస్థితి బాగుంటుంది కనుక, ఈ ఏడాది మీకు మంచి సమయం. దీనితోపాటుగా, పూర్వీకుల సంపద కూడా చేరుతుంది. ఒకవేళ మీరు మీడబ్బును ఏదైనా కొత్తదానిలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే, దాని వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. సంవత్సరం యొక్క చివరల్లో ఏదైనా పెద్దపెట్టుబడి పెట్టవద్దు. ఒకవేళ ఏవిధంగానైనా మీరు పెట్టుబడి పెట్టినట్లయితే, అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. లేనిపక్షంలో, మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. డబ్బు లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో తొందరపడవద్దు. స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తి ద్వారా మోసగించబడే అవకాశం ఉంది. మీ ఆస్తిని పెట్టుబడి పెట్టేటప్పుడు పెద్దవారి సలహా లేదా సూచనలు మీకు లాభం కలిగించవచ్చు. అనవసరమైన వ్యయాలు మరియు అప్పులను తీసుకోరాదని మీకు సూచించబడుతోంది. కుటుంబసభ్యుల ఆరోగ్యం మీకు ఒత్తిడిని కలిగించవచ్చు. శత్రువుల యొక్క చర్యలు మీపై వ్యతిరేక ప్రభావం కలిగిస్తాయి, ఫలితంగా మీరు ఒత్తిడికి గురవుతారు. అయితే, ఇటువంటి కష్టాల నుంచి మీరు బయట పడతారు. వ్యాపారంలో ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడానికి ముందు, జాగ్రత్తగా ఆలోచించండి. జూదం మరియు లాటరీ వంటివాటిలో పెట్టుబడి పెట్టకుండా పరిహరించడం మంచిది. మీ వైవాహిక జీవితంతో శాంతి మరియు సామరస్యాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగించవచ్చు.

పని చేసేవారికి ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. ఒకవేళ ఈ ఏడాది మీరు ఎలాంటి లాభాన్ని పొందరు, అదేవిధంగా నష్టాలను కూడా పొందరు. కచ్చితంగా, ఈ ఏడాది మీకు అధిక సంతోషాన్ని పొందుతారు. బాస్ మరియు సహోద్యోగులు మీకు బాగా సహాయపడతారు. ఉద్యోగం కొరకు ప్రయత్నించే యువత ఉద్యోగాన్ని పొందుతారు. అదనంగా,ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్‌కు మంచి అవకాశాలున్నాయి. ఈ ఏడాది విద్యార్థులకు సుమారుగా ఉంటుంది. పరీక్షలో విజయం సాధించడం అనేది పూర్తిగా మీరు పడే కష్టంపై ఆధారపడి ఉంటుంది. టీచర్లు మరియు పెద్దవారి మద్దతుతో మీరు పురోభివృద్ధి సాధిస్తారు. ప్రేమ సంబంధాలను విజయం సాధించే రేటు తక్కువగా ఉంటుంది. మీ లవర్ పట్ల కోపగించుకోవడాన్ని తగ్గించుకోవాలని 2017 రాశిఫలాలు సూచిస్తున్నాయి. అర్థం చేసుకోవడం మరియు ఆరోగ్యవంతమైన చర్యల ద్వారా దేనినైనా పరిష్కరించుకోవచ్చు. వివాహం కానివారు ఇంకా వేచి ఉండాల్సి ఉంటుంది, అయితే సరైన సమయంలో మంచి ఫలితాలు సాధించవచ్చు.

పరిష్కారం: అవసరం ఉన్న వ్యక్తులకు సాధ్యమైనంత వరకు సాయం చేయండి.

రేటింగ్: 3.5/5

వృశ్చికం (Vrushchika)

Vrushchika rasi phalalu 2017 ఈ ఏడాది మీరు కొత్త ఆదాయవనరులను కొన్నింటిని పొందుతారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో అశ్రద్ధగా ఉండవద్దు, కొన్నిసార్లు మీరు సంపాదించేదానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. పుణ్యకార్యాల్లో మీ ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుడి నుంచి మీరు ఆర్థిక సాయాన్ని పొందుతారు. ఈ ఏడాది మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ యొక్క ధైర్యం కూడా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలుంటే అవి తొలగిపోతాయి. అంచనాల ప్రకారం, మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. మీరు మరింత సామాజికంగా కూడా ఉంటారు. పిల్లల యొక్క విజయం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. పని వద్ద మీరు భారీ విజయాలను సాధిస్తారు. అదేవిధంగా సీనియర్ అధికారి మీకు మద్దతు ఇస్తాడు. కొత్త కోర్సులో చేరాలని ప్లాన్ చేసే విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా, పోటీపరీక్షల్లో మీరు విజయం సాధించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మీ కుటుంబజీవితం అద్భుతంగా ఉంటుంది. మీ తోబుట్టువుల నుంచి కూడా మీరు మద్దతు పొందుతారు. మీ జీవితానికి కొత్త స్నేహితులు జోడించబడతారు.

వ్యాపారవేత్తలు కొత్త ఆదాయవనరులను పొందుతారు. చిన్న వ్యాపారాల్లో సైతం వారు మంచి లాభాలను పొందుతారు. విదేశాలు ప్రయోణించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే, పనికి సంబంధించిన స్వల్పకాలిక ప్రయాణాలు చేస్తారు. ఒకవేళ సంవత్సరం ప్రారంభంలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా సమస్య ఎదుర్కొన్నట్లయితే, గాభరా పడవద్దు. ప్రేమజీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండవని నక్షత్ర ఫలితాలు తెలియజేస్తున్నాయి, ప్రతిదీ కూడా మీ మార్గంలోనే సాగుతుంది. ఒకవేళ సంబంధాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, వాటిని పరిష్కరించుకోవడం వల్ల మీకు లాభం కలుగుతుంది. మీ ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ద వహించండి, ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడంపై మీరు ప్రధానంగా దృష్టి సారించాలి. గుండె మరియు పొట్టకు సంబంధించిన కొన్ని సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే, ఇవి చాలా స్వల్పకాలం పాటు ఉంటాయి.

పరిష్కారం: మంగళవారం మరియు శనివారం పేదలకు అన్నదానం చేయాలి.

రేటింగ్: 3/5

ధనుస్సు (Dhanusu)

Dhanusu rasi phalalu 2017 ఈ ఏడాది వ్యాపావేత్తలకు బాగుంటుంది. అయితే, సంవత్సరం చివరల్లో మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు, మంచి మరియు చెడ్డ ఫలితాలకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సంవత్సరం మొదటి సగభాగంలో, మీరు కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే, సంవత్సరం చివరికి వచ్చే సరికి పరిస్థితులు సర్దుకుంటాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల విషయం గురించి మాట్లాడినట్లయితే, ఈ ఏడాది వారికి అత్యంత శక్తివంతంగా ఉండవచ్చు. జాతకచక్రం ప్రకారంగా, నేత్ర విద్య మరియు సైకాలజీ చదివే విద్యార్థులకు మరింత సానుకూలంగా ఉంటుంది. పరీక్షలు విజయం సాధించే అవకాశాలు కూడా భారీగా ఉన్నాయి. పని చేసే వ్యక్తులకు సైతం ఈ ఏడాది చాలా బాగుంటుంది. ప్రమోషన్ సాధించే అవకాశాలు భారీగా ఉన్నాయి. బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు, మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ మంచి తీరు యొక్క ప్రభావం మీ కెరీర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. మీ సీనియర్‌లతో మీరు మంచిగా ఉన్నట్లయితే, అన్ని విషయాలు కూడా అద్భుతంగా సాగుతుంది. ప్రయాణించాలని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రభుత్వ శాఖల నుంచి ప్రయోజనాలు ఆశించబడుతున్నాయి, దీని వల్ల మీ గౌరవమర్యాద పెరుుగుతుంది. ఈ ఏడాది ప్రేమ వ్యవహారాలు సుమారుగా ఉంటాయి. మీ ప్రేమ జీవితంలో మీరు పెద్దగా సమస్యలు ఎదుర్కొనరని రాశిఫలితాలు తెలియజేస్తున్నాయి. ప్రతిదీ కూడా సాధారణంగా సాగిపోతుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించండి. ఆగస్టు తరువాత, మీ ప్రేమ జీవితం నుంచి శృంగారం అదృశ్యం అవుతుంది. మీ ప్రేమ విషయంలో మీరు అలర్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ సైతం కొన్ని సమస్యలను కలిగించవచ్చు. పొట్టకు సంబంధించిన కొన్ని సమస్యలు రావొచ్చని ఆశించబడుతోంది. అందువల్ల, మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించండి. అయితే, మీ పని సామర్థ్యంపై ఇది ఎలాంటి ప్రభావం కలిగించదు.

పరిష్కారం: గురువారం నాడు, పేదవారికి పసుపురంగు స్వీట్లను పంచండి.

రేటింగ్: 2.5/5

మకరం (Makara)

Makara rasi phalalu 2017 ఆర్థికంగా, ఈ ఏడాది మీకు సుమారుగా ఉంటుది. అదనపు ఖర్చులపై మీరు నియంత్రణ సాధించాలి. నేడు పొదుపు చేసేది, రేపటికి అక్కరకు వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దగ్గర బంధువులు మరియు స్నేహితులతో డబ్బు లావాదేవీలకు విషయంలో సైతం సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది వ్యాపావేత్తలకు బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి లేదా లాటరీ ద్వారా హటాత్తుగా ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు అద్భుతమైన అవకాశాలుంటాయి. ఈ ఏడాది విద్యార్థులకు ప్రత్యేకంగా ఉంటుందని మకర రాశిఫలాలు 2017 ఊహిస్తున్నాయి. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు సైతం విజయం సాధిస్తారు. పనిచేసే వ్యక్తులు అనేక అవకాశాలను పొందుతారు. ప్రమోషన్ మరియు మంచి ఉద్యోగంతోపాటుగా, మీరు చక్కటి మర్యాద పొందే అవకాశాలున్నాయి,. కొత్త ఉద్యోగం కొరకు వెతుకుతున్నవారు, కొంతసమయం వేచి ఉండాలి. విద్యకు సంబంధించిన అడ్డంకులు ఈ ఏడాది తగ్గుతాయి మరియు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. ఉన్నతవిద్య కొరకు,మీరు విదేశాలకు వెళ్లవచ్చు. ఈ ఏడాది కుటుంబపరిస్థితిక సాధారణంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి,.

మీరు పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లవచ్చు. స్నేహితులు మీకు గొప్పగా మద్దతు అందిస్తాయి మరియు ఆఫీసులోని అధికారులు సైతం మీ పనితో ప్రభావితం అవుతారు. ఈ ఏడాది ప్రేమ వ్యవహారాలు సుమారుగా ఉంటాయి. ఇప్పటికే ప్రేమలో పడ్డవారికి, ఈ ఏడాది మెరుగ్గా ఉంటుంది. కొత్త ప్రేమ సంబంధాలకు ఈ సంవత్సరం అంత మంచిది కాదు. ఎవరి ముందు అయినా మీ హృదయాన్ని బహిర్గతం చేయండి, అయితే వారిపై ఒత్తిడి చేయవద్దు. కొంత కాలం గడిచిన తరువాత, వారే ‘అవును’ అని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం పట్ల మీరు కొంత జాగ్రత్త పాటిస్తే మంచిది. ఈ ఏడాది మీ ఆరోగ్యంలో కొంత ప్రమాదకరంగా ఉండవచ్చు. చెడ్డ ఆహారపు అలవాట్లు మరియు వాతావరణం మారడం వల్ల మీరు కొన్ని చిన్నపాటి సమస్యలు కలగవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం కొరకు సాద్యమైనంత వరకు మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆకుకూరలు తీసుకోవడం అనేది మీకు ఔషధంగా పనిచేయవచ్చు.

పరిష్కారం: మీ పనిప్రాంతంలో నిజాయితీగా ఉండండి మరియు మీ కింద పనిచేసేవారికి మర్యాద ఇవ్వండి.

రేటింగ్: 3/5

కుంభం (Kumbha)

Kumbha rasi phalalu 2017 మీ స్వంత పని యొక్క నాణ్యతపై మీరు ఆశ్చర్య పడతారు. ప్రత్యర్థులుమీతో ఉను్న అన్ని రకాల వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇతరులకు సాయం చేయడానికి ముందు, మీ ఆర్థిక స్థితిని మొదట పరిగణనలోకి తీసుకోండి. అధికంగా ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మీరు సమస్యలు ఎదుర్కొనవచ్చు. ఆదా చేసిన డబ్బు భవిష్యత్తులో మీకు లాభం కలిగిస్తుంది. సంవత్సరం యొక్క రెండో సగభాగంలో, మీ డబ్బు గురించి మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. సంవృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ఏడాది వ్యాపారవేత్తలకు మరియు దానికి సంబంధించిన వ్యక్తులకు మంచి లాభం కలుగుతుంది. భాగస్వామితో నిజాయితీగా ఉండాలని సూచించబడుతోంది, లేనిపక్షంలో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు. సంవత్సరం యొక్క రెండో సగభాగంలో మీరు వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే, ఇవి చాలా స్వల్పకాలం పాటు ఉంటాయి. ఒకవేళ కొన్ని విషయాలను విడిచిపెట్టినట్లయితే, మిగిలిన సంవత్సరం అంతటా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో ఈ ఏడాది మెరుగ్గా ఉంటుంది. ప్రమోషన్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల, కష్టపడి పనిచేయడం కొనసాగించడం వల్ల నిరుత్సాహ పడరు. ఉద్యోగం కొరకు ప్రయత్నించే యువత ఉద్యోగాన్ని పొందుతారు. కెరీర్‌లో మంచి ప్రారంభం పొందే అవకాశం కూడా ఉంది. న్యాయం, వైద్యం, వాణిజ్యం మొదలైన వాటికి చెందిన వ్యక్తులు సానుకూల సమయాన్ని పొందుతారు.

ఈ ఏడాది విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మరింత కష్టపడి పనిచేసినప్పటికీ మీరు తక్కువ ఫలితాలను పొందినట్లయితే, ఆందోళన చెందవద్దు. మీకు కచ్చితంగా మీ భాగం విజయాన్ని సాధిస్తారు. బాగా ఆలోచించిన తరువాత సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత సంబంధాలను సక్రమంగా ఉంచుకోవడం కొరకు, మీరు అవగాహన కలిగి ఉండాలి. తల్లిదండ్రులతో ఈ ఏడాది సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. రోజువారీ జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ జీవితభాగస్వామికి తగిన సమయాన్ని కేటాయించలేకపోతారు. దీని వల్ల మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. కొంత సమయం చూసుకొని, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయండి.

పరిష్కారం: కార్మికులు, పనివారు, పేదవారికి గౌరవం ఇవ్వండి, అవసరం అయితే వారికి పాయం చేయండి.

రేటింగ్: 3.5/5

మీనం (Meena)

Meena rasi phalalu 2017 మీన రాశివారు ప్రతిదశలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది, ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. మీ సామర్థ్యాన్ని మించి నిర్ణయాలు తసీుకోవద్దు. సుదీర్ఘ ప్రయాణాలు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఎవరైనా కొత్తవ్యక్తిని వెంటనే నమ్మవద్దు. సంవత్సరం యొక్క మధ్యకు వచ్చే సరికి, మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. అంచనాలనుబట్టి, మీ ప్రత్యర్థులను ఎదుర్కొనడం మీకు చాలాకష్టమైన వ్యవహారం. మానసికంగా ఎక్కువగా శ్రమించవద్దు. మీ విజయ రహస్యాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవద్దు. మీ స్నేహితులు మరియు బంధువుల ద్వారా, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను మీరు కలుసుకోవచ్చు. దేనినైనా మీరు కష్టపడి పనిచేసినట్లయితే, దానిలో మీరు మంచి ఫలితాలు పొందుతారు. మీరు అవార్డును సైతం పొందవచ్చు. సానుకూలంగా ఆలోచించడం వల్ల మీకు చాలా సహాయపడుతుంది. ఇతర వ్యక్తులు మీ పని ద్వారా చాలా సంతృప్తి చెందుతారు. కొత్త టెక్నిక్ లేదా నైపుణ్యాన్ని కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు, ఇది కొత్త ఆదాయవనరును అందిస్తుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు తమ సహోద్యోగులతో సంతులనం పాటించాలి. కొత్త ఉద్యోగం సంపాదించుకునేంత వరకు, ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయవద్దు. లేనిపక్షంలో, కొత్త ఉద్యోగం పొందడం కొరకు మీరు ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే, మీరు కొత్త ఉద్యోగం పొందలేరని అర్థం కాదు. సంవత్సరం చివరల్లో కొత్త ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.

మీ కుటుంబసభ్యులతో కలవడాన్ని పెంచండి. మీ వైవాహిక జీవితంంలో కొంత సమయాన్ని తీసుకొని, మీ జీవితభాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని 2017 రాశిఫలాలు సూచిస్తున్నాయి. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ప్రేమ సంబంధాల్లో బేదాభిప్రాయాలకు దూరంగా ఉండండి, లేనిపక్షంలో సమస్యలు తలెత్తవచ్చు. ఎవరి గురించి అయినా తొందరపడి ఒక నిర్ణయానికి రావొచ్చు, ఇది ఇతర వ్యక్తులను మానసికంగా బాధించవచ్చు. మీ ఆరోగ్య విషయానికి వస్తే, మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట మరియు రక్తానికి సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించినట్లయితే, ఇటువంటి సమస్యలను మీరు పరిహరించవచ్చు. మీ జీవనశైలికి మార్పులు చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది.

పరిష్కారం: మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు చేర్చండి.

రేటింగ్: 3/5

ఈ రాశిఫలాలు మీ జీవితాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి దోహదపడతాయని మేం ఆశిస్తున్నాం. ఇక్కడ ఇవ్వబడ్డ సమాచారాన్ని అత్యధికంగా ఉపయోగించుకోండి. అన్నిరాశులకు సంబంధించిన 2017 రాశిఫలాలను చదివినందుకు ధన్యవాదాలు.

Read Other Zodiac Sign Horoscope 2017

Related Articles

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers